వింత ప్రకటన: అలాంటి మొగుడు కావాలి?
తన సంబంధం కోసం తానే ప్రకటన ఇచ్చింది. అందులో తనకు ఎలాంటి వరుడు కావాలో మొహమాటం లేకుండా చెప్పేసింది. ఆ లక్షణాలు ఏంటో తెలుసా.. కాబోయే మొగుడు అసత్యాలు చెప్పకూడదట. అతడికి పిసినారితనం ఉండకూడదట. అతడు ఏ కులానికి చెందినవాడైనా అభ్యంతరం లేదట. అతడు మరీ ఎక్కువ చురుగ్గా ఉండనక్కర్లేదట. కొద్దిగా చురుగ్గా ఉంటే చాలట. తన కంటే చిన్నవాడైనా పర్లేదట.. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఆసక్తి ఉంటే సంప్రదించండంటూ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.