కడప కుర్రాళ్లకు వైసీపీ గుడ్ న్యూస్?
ఈ మెగా జాబ్ మేళా పోస్టర్, వెబ్ సైట్ ను విజయసాయి రెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ సూచన మేరకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించామన్న విజయసాయి.. 40 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కడప జిల్లాలో కూడా ఈనెల 25న నిర్వహించే జాబ్ మేళాలో 100 ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చాయి. దాదాపు 10 వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. జాబ్ మేళా నిర్వహణకు సీబీఐటీ ఛైర్మన్ జయచంద్రారెడ్డి ఉచితంగా వసతి కల్పించారు.