ఆ జిల్లావాసులకు గుడ్ న్యూస్.. పులి పీఛేముడ్‌?

Chakravarthi Kalyan
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో 15 రోజులకుగా సంచరిస్తున్న పులి ఇప్పుడు తిరుగుబాట పట్టిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు ఇంకా ఫలించ లేదు. నిన్న రాత్రి శరభవరం, పొదురుపాక వద్ద ఏర్పాటు చేసిన బోన్ల వద్దకు పులి రానేలేదు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమారాల్లో పులి జాడ నమోదు కాలేదు. పులి పాదముద్రల కోసం అటవీ సిబ్బంది గాలించినా ప్రయోజనం లేకపోయింది. జోరు వాన కురవడంతో పాదముద్రలు కూడా దొరక లేదు. గ్రామాల్లో పులి ఆచూకీ కోసం దాదాపు 6 బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. అటవీ బేస్ క్యాంప్ ను కూడా పాండవులపాలెం నుంచి శరభవవరం మార్చారు.


అయితే తాజాగా వస్తున్న శుభవార్త ఏంటంటే.. పులి అడవిలోకి వెళ్లేందుకు వెనుదిరిగిందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అది అడవిని చేరుకుంటుందని.. ఇక పులితో ఇబ్బందులు తొలగిపోయినట్టేనని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: