సీఎంగా పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు ఒప్పుకుంటారా?

Chakravarthi Kalyan
వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చబోనంటున్న పవన్‌ కల్యాణ్‌.. పొత్తులపై మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఇన్నాళ్లూ కరోనా వల్లే బిజెపితో సామాజిక దూరం పాటించామని.. బిజెపితో పొత్తు ఉందిని.. . వారితో కలిసి పని చేయాలని తన పార్టీ కార్యకర్తలకు చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో ఎలా ముందుకు
వెళ్లాలనే అంశంపై టీడీపీ క్లారిటీ ఇచ్చేశారు.
గతంలో అన్ని సార్లు మేం తగ్గామని.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని టీడీపీకి సంకేతాలు పంపారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముందు మూడు మార్గాలు ఉన్నాయంటున్న పవన్‌ అవేంటో క్లారిటీగా చెప్పారు.. ఆప్షన్‌ వన్.. జనసేన ఒంటరిగా బరిలో దిగడం.. ఆప్షన్‌ టూ.. జనసేన, బీజేపీ పొత్తు.. ఆప్షన్‌ త్రీ.. జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు.. ఈ మూడు ఆప్షన్లో మూడో ఆప్షన్‌కు టీడీపీ ఓకే అయితే.. సీఎం పీఠం మాత్రం జనసేనదేనని పవన్ అంటున్నారు. అందుకే ఈ సారి తగ్గేదేలేదంటున్నారు. మరి పవన్ ను కూటమి సీఎం అభ్యర్థిగా నిలబెట్టేందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా.. అది అయ్యే పనేనా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: