ఉక్రెయిన్‌కు చావుదెబ్బ.. ఆయుధ డిపో ధ్వంసం?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా దూకుడు పెంచుతోంది. ఆ దేశంపై భీకరంగా దాడులు చేస్తోంది. పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సైనిక మద్దతుతో గట్టిగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు రష్యా తాజాగా చుక్కలు చూపిస్తోంది. ఉక్రెయిన్ ఆయువు పట్టుగా ఉన్న ఆయుధ స్థావరాలను పుతిన్‌ సేనలు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో క్రైవీ రిహ్ లో కీలకమైన ఆయుధ డిపోను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. క్రైవీరిహ్‌ నగరంలోని ఓ పారిశ్రామికవాడలో ఉన్న ఆయుధ డిపోను క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా తెలిపింది. అంతే కాదు.. ఈ దాడిని ఉక్రెయిన్‌ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రష్యా జరిపిన రాకెట్‌ దాడులతో క్రివీరిహ్‌ నగరంలోని ఓ పారిశ్రామిక ప్లాంటులో అగ్నికీలలను ఎగశాయి. భారీ నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్‌ చెబుతోంది. తాను చేసిన ఫిరంగుల దాడి దృశ్యాలను కూడా రష్యా సైన్యం విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: