రష్యాకు ఉక్రెయిన్ షాక్‌.. ఆ నగరం స్వాధీనం?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో అప్పుడప్పుడు ఉక్రెయిన్ కూడా సత్తా చాటుతోంది. యుద్ధం మొదలయ్యాక  రష్యా ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఖార్కివ్‌ నగరాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా నుంచి తిరిగి కైవసం చేసుకున్న ఖార్కివ్‌ నగరంలో..... ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా పర్యటించారు. రష్యా దాడిలో జరిగిన నష్టాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పరిశీలించారు.
ఖార్కివ్‌ నగర పునర్నిర్మాణం చేసుకోవాలన్న జెలెన్‌స్కీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిదెబ్బతిన్న నివాస భవనాలను పరిశీలించారు. రష్యా దాడిలో ఖార్కివ్‌ నగరంలోని ఉత్తర, తూర్పు భాగాల్లో మొత్తం 2వేల ఒక వంద నివాసాలు దెబ్బతిన్నాయి.  ఈ విషయాన్ని స్థానిక గవర్నర్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకు వివరించారు. ఖార్కివ్‌లోని సైనికులను కూడా కలిసిన జెలెన్‌స్కీ వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రాణాలను పణంగా పెట్టి.. దేశ స్వాతంత్ర్యం కోసం వారు పోరాడుతున్నారని  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: