మోదీపై తెలంగాణ మంత్రి కారాలు.. మిరియాలు?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్‌ పై చేసిన విమర్శలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఖండించారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరుల గురించి ఉచ్చరించే అర్హత లేదని మండిపడ్డారు. మాటలు తప్ప మోడీ ప్రభుత్వంలో చేతలు కరువయ్యాయన్న నిరంజన్‌రెడ్డి.. స్వచ్ఛ భారత్, భేటీ బచావో - భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవేనన్నారు.
రాష్ట్రంలో భాజపాకు చోటు లేదు... నరేంద్రమోదీది అత్యాశ అని.. మోదీ, షాలు దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి... దీపాలు వెలిగించండి అని ప్రజలను వారి మానాన వారిని వదిలేశారని మంత్రి  నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: