చైనా దూకుడుకు ఇండియా అడ్డుకట్ట వేయడం లేదా?

Chakravarthi Kalyan
లద్దాఖ్ ప్రాంతంలో చైనా దూకుడుకు ఇండియా అడ్డుకట్ట వేయడం లేదా.. చైనా దూసుకొస్తుంటే.. ఇండియా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందా.. అంటే అవునంటున్నారు రాహుల్ గాంధీ.. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనలు నిర్మిస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా తొలి వంతెన కడుతున్న సమయంలో ప్రశ్నించినా.. అప్పుడు తాము పరిశీలిస్తున్నామని కేంద్రం సమాధానం చెప్పిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇప్పుడు చైనా  రెండో వంతెన కడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అదే పాట పాడుతోందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశ రక్షణ, ప్రాదేశిక సమగ్రతలో రాజీపడే ప్రసక్తే ఉండకూడదని రాహుల్ గాంధీ కేంద్రానికి సూచించారు. ఈ విషయంలో పిరికితనం పనికిరాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని రక్షించాలని రాహుల్ గాంధీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: