BREAKING : శ్రీలంక ప్రధాని రాజపక్సే రాజీనామా!

Purushottham Vinay
శ్రీలంక ప్రధాన మంత్రి అయిన మహింద రాజపక్సే ఎట్టకేలకకు తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేయాలని గత కొంతకాలంగా కూడా శ్రీలంకతో అనేక రకాల ఆందోళనలు అనేవి బాగా మిన్నంటాయి.ఇక రాజపక్సే సోదరులు గద్దె దిగడానికి విపక్షాలు వారం రోజుల డెడ్‌లైన్‌ పెట్టాయి. దీంతో డెడ్‌లైన్‌ కంటే ముందే మహింద రాజపక్సే రాజీనామా చేయడం జరిగింది. గత నెల రోజుల నుంచి శ్రీలంక దేశం ఆర్ధికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.


ఇక నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశంలో చుక్కలను తాకాయి.శ్రీలంక దేశ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇక భావోద్వేగాలకు ఇది సమయం కాదు. .. హింస అనేది మరింత హింసను ప్రేరేపిస్తుంది. ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం అనేది లభిస్తుంది అంటూ రాజీనామాకు ముందు సోషల్ మీడియా ద్వారా తెలిపారు మహింద రాజపక్సే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: