ఇండియా ఆ విషయంలో మేలుకోకపోతే డేంజరే?

Chakravarthi Kalyan
ఇండియాను విద్యుత్ సంక్షోభం చుట్టుముడుతోంది. దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను అందుకోవాల్సిన అవసరం ఉంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు వాహనాల సంఖ్య పెరిగినా.. విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 2040నాటికి బొగ్గు అవసరం రెట్టింపు కానుంది. పెరుగుతున్న ఇంధన అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉంది. థర్మల్ బొగ్గు దిగుమతులను తగ్గించుకోవాలి. బొగ్గు రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలి. కొంతకాలం క్రితం బొగ్గు అవసరం తగ్గుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు దాని అవసరం పెరుగుతోంది. మూతబడిన బొగ్గుగనుల్లో 380 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. వాటి నుంచి 30-40 మిలియన్‌ టన్నుల బొగ్గు తీయవచ్చు. మైనింగ్‌ కార్యకలాపాలతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగుతాయి. బొగ్గు సరఫరా కూడా మెరుగుపడుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై దృష్టి సారించినా.. ఇంధన ఉత్పత్తిలో ఇప్పటికీ బొగ్గు కీలకంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: