పుతిన్‌ లవర్‌కు ఈయూ షాక్ ఇవ్వబోతోందా?

Chakravarthi Kalyan
పుతిన్‌ లవర్‌కు ఈయూ షాక్ ఇవ్వబోతోందా.. అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్యను నిలువరించేందుకు ఈయూ ప్రతిపాదించిన ఆరో ఆంక్షల ప్యాకేజీలో ఈ వివరాలు కలకలం రేపుతున్నాయి. ఈయూ ప్రకటించబోతున్న ఆంక్షల ప్యాకేజీలో పుతిన్  ప్రియురాలు అలీనా కబయేవా పేరు కూడా ఉందంటున్నారు. ఈ ఆంక్షల జాబితాను ఈయూ తన 27 సభ్య దేశాలకు అందించింది. అయితే ఇంకా వాటిని ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే... పుతిన్ లవర్ అలీనా యూరోపియన్ యూనియన్‌లో అడుగుపెట్టకుండా నిషేధం అమలులోకి వస్తుంది. ఆమె ఆస్తులను కూడా స్తంభింపజేస్తారు. ఒలింపిక్స్  గోల్డ్  మెడలిస్ట్  అలీనాకు పుతిన్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. పుతిన్ ఈ విషయాన్నిఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదనుకోండి. ప్రస్తుతం అలీనా తన సంతానంతో స్విట్జర్లాండ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. పుతినే వారిని స్వయంగా అక్కడకు పంపించారని ప్రపంచ మీడియా రాసుకొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: