ఆ ఒక్క వార్తతో.. ఆ కంపెనీకి 2 లక్షల కోట్లు లాస్‌?

Chakravarthi Kalyan
స్టాక్‌ మార్కెట్‌లో విశ్వాసం చాలా ప్రధానం.. ఏ కంపెనీపైన అయినా సరే వినియోగదారుడికి నమ్మకం పోతే.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మార్కెట్లో స్ప్రెడ్ అయ్యే వదంతులు కొన్ని కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడతాయి. తాజాగా అలాగే జరిగింది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ అరెస్ట్ అయ్యారన్న వార్త.. ఆయన సంస్థకు రూ.1.97 లక్షల కోట్లు నష్టం తెచ్చింది. మా అరెస్టు అయ్యారు అన్న ఒక వదంతి కారణంగా అలీబాబా కంపెనీ నిమిషాల్లో అక్షరాల రూ.1.97 లక్షల కోట్లు కోల్పోయింది. రెండేళ్ల నుంచి జాక్‌మాపై చైనా సర్కారు గుర్రుగా ఉంది. అందుకే తాజాగా మా అరెస్టు అయ్యారంటే జనం నిజమే అనుకున్నారు. అందులోనూ ఆ వార్త ఇచ్చింది చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌. అందుకే దాని రియాక్షన్ ఆ రేంజ్‌లో ఉంది. ఆ తర్వాత అది తప్పుడు వార్త అని గ్లోబల్‌ టైమ్స్‌ వివరణ ఇచ్చాక అలీబాబా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: