షాకింగ్‌: టెంత్‌ లీకుల వెనుక నారాయణ?

Chakravarthi Kalyan
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో లీకులు బాగా జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ లీకుల వెనుక నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్ల హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారట. తిరుపతి నారాయణ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.గిరిధర్‌ రెడ్డి ఏకంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి వాట్సప్‌లో పేపర్ తెప్పించుకున్నారట. చిత్తూరులో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ గవర్నమెంట్ టీచర్‌ ని ప్రలోభపెట్టి పేపరు తెప్పించుకున్నాట. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి పంపారట. ఈ కేసులో గిరిధర్‌తో పాటు చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆరీఫ్, డీన్‌ కె.మోహన్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌,  సోములను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: