గుడ్‌న్యూస్: ఆ ఖాతాల్లో రూ.4.5 లక్షలు వేయనున్న జగన్

Chakravarthi Kalyan
సీఎం జగన్ రైతులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్‌ఆర్‌ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ ఆర్ జలకళ కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం  13,245 బోర్లు వేసింది. ఒక్కో బోరుకు కనీసం 4.50 లక్షల ఖర్చు చేస్తోంది. అయితే ఇకపై బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు డీబీటీ విధానంలో రైతు అకౌంట్‌కు నేరుగా  జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డబ్బు రైతుల నుంచే బోరు డ్రిల్లింగ్ వారికి  చెల్లించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలతో ఉచితంగా బోరు వేయిస్తుంది. అయితే.. 5–10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు  కేవలం డ్రిల్లింగ్‌ మాత్రమే ఉచితంగా చేస్తుంది. అంటే జల కళ కింద ప్రతి రైతుకు యూనిట్ కు సుమారు  4 నుంచి 5 లక్షల రూపాయలు మేర ప్రభుత్వం సాయం చేస్తుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: