ఇండియాకు బ్యాడ్‌ న్యూస్.. మళ్లీ ఆకలి రాజ్యం?

Chakravarthi Kalyan
1970-80 మధ్య కాలంలో ఇండియాలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో ఆ సమస్యపై ఆకలి రాజ్యం వంటి అనేక సినిమాలు నిరుద్యోగం కథాంశంగా వచ్చాయి. తాజాగా వచ్చిన గణాంకాలు చూస్తే ఇండియాలో మళ్లీ నిరుద్యోగం పెరుగుతోందని చెబుతున్నాయి. భారత్ లో నిరుద్యోగిత రేటు 7.83 శాతానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. మార్చిలో ఇండియాలో 7.6శాతంగా నిరుద్యోగిత రేటు ఉంది. అది ఏప్రిల్లో 7.83శాతానికి పెరిగింది. ఈ నిరుద్యోగిత రేటు ఎక్కువగా పట్టణాల్లో నమోదైంది. పట్టణాల్లో మార్చిలో 8.28శాతంగా ఉన్న నిరుద్యోగిత.. ఏప్రిల్ నాటికి 9.22 శాతానికి పెరిగింది. గ్రామాల్లో పరిస్థితి కాస్త బెటర్. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత కొంతమేర తగ్గినట్టు ఈ నివేదిక చెబుతోంది.  కరోనా కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నట్టు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: