18 లక్షల ఖాతా దారులకు వాట్సప్‌ బిగ్ షాక్‌?

Chakravarthi Kalyan
సామాజిక మాధ్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాట్సప్‌ ఇటీవల తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. గత మార్చి నెలలో ఏకంగా 18లక్షల భారతీయుల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కారణంగాఈ నిర్ణయం తీసుకుంది. అలాగే  ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా కూడా వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా అనేక మార్గాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మార్చి నెలలో 18.05 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్టు వాట్సప్ ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ తన నెల వారీ నివేదికలో వివరాలు తెలిపింది. అలాగే ఫిబ్రవరిలోనూ 14 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించామని వాట్సాప్ చెబుతోంది. అకౌంట్ హోల్డర్ల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామంటున్న వాట్సప్ అందులో భాగంగానే ఈ ఖాతాల నిషేధమని తెలిపింది. ఇందు కోసం కృత్రిమ మేధతో పాటు అనేక టెక్నాలజీలు వాడుతున్నామని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: