గుడ్‌న్యూస్‌: ఆ విద్యార్థులకు జగన్‌ మరో ఫ్రీ కానుక?

Chakravarthi Kalyan
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతి ఇస్తారు. చాలా మంది విద్యార్థులు తాము చదివిన పాఠశాల కాకుండా ఇతర పాఠశాలల్లో పరీక్ష కేంద్రం ఉంటుంది. ఇలాంటి వారు పరీక్ష కేంద్రానికి చేరేందుకు వీలుగా.. హాల్ టికట్ చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది జగన్ ప్రభుత్వం. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికి ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ నిర్ణయం బావున్నా.. అమలులో ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే.. ఆర్టీసీ కండక్టర్లు కొందరు ఉచితంగా వచ్చే వాళ్లను ఎక్కించుకునేందుకు ఆసక్తి చూపరు. అలా చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఇది చాలా మంచి నిర్ణయంగా చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: