ఇవాళ తూర్పు గోదావరి జిల్లాకు జగన్?

Chakravarthi Kalyan
సీఎం జగన్ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్యటిస్తారు. ఆయన  బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమంలో సీఎం వైయ‌స్‌ జగన్‌తో పాటు  ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా కూడా పాల్గొంటున్నారు. ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్  బయలుదేరతారు. ఉదయం  11 గంటలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బలభద్రపురం చేరతారు. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్..  కుమార మంగళం బిర్లాతో కలిసి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత 12.40 గంటలకు బలభద్రపురం నుంచి సీఎం జగన్ బయలుదేరి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: