ఆ రాజధానిని మాకివ్వండి.. సీఎం ఆగ్రహం..?
చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు కేంద్ర సివిల్ సర్వీసులకు అనుగుణంగా ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను కూడా మాన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు నియంతృత్వ ధోరణిలో ఉన్నాయని సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. అంతే కాదు.. పంజాబ్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ కలసిరావాలని పంజాబ్ కొత్త సీఎం చెబుతున్నారు.