మరో వైసీపీ నేతపై రేప్ కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన ఓ బాలికను రేప్ చేశాడని.. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఏపీ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్.. ఆఫ్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబుపై కేసు నమోదైంది. ఆయనపై బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ విచారణకు ఆదేశించింది. తన కుమార్తెను అనిల్ తన గెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లి రేప్ చేశారని ఆరోపించారు. అంతే కాదు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని.. వివరించారు. తన కుమార్తె భయపడి, విచారణ సమయంలో అనిల్ కుమార్ పేరు చెప్పలేదని ఎస్సీ కమిషన్‌కు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారపై ఇప్పుడు ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇదే కేసులో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుయాయుడు కన్నా భూశంకర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు వైసీపీ నేతలపై కేసులు పెట్టడం సంచలనంగా మారింది.