అయ్యయ్యో: కరోనా టీకా తీసుకున్న బాలుడు మృతి?

Chakravarthi Kalyan
నిజామాబాద్ జిల్లాలో కరోనా టీకా తీసుకున్న బాలుడు కొద్ది గంటల తర్వాత అస్వస్థతతో కన్నుమూసిన ఘటన జరిగింది. చందూర్ పాఠశాలలో 12-14ఏళ్ల లోపు విద్యార్థులకు కరోనా టీకాలు ఇస్తున్నారు. నిన్న ఉదయం టీకా తీసుకున్న శివకుమార్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుడిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే రాత్రి బాలుడు మృతి చెందాడు.


ఇది టీకా వల్లే జరిగి ఉంటుందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన వైద్యులతో మాట్లాడిన అధికారులు.. వడ దెబ్బ కారణమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ బాలుడు రెండు రోజులుగా బాలుడు ఎండలో ఆడుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం చేస్తే తప్ప మృతికి అసలైన కారణం చెప్పలేమంటున్నారు అధికారులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: