ఆదోని జిల్లా డిమాండ్ ను ముందే ఎందుకు చెప్పలేదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే అక్కడి ప్రజల డిమాండ్‌పై తాజాగా స్పందించారు. ఈ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ చర్చ జరిగింది.
ఆదోనికి ప్రత్యేక జిల్లా డిమాండ్‌ను జిల్లా కమిటీల ముందుకు ఎందుకు తీసుకెళ్లలేదని, అలాగే ఎన్నికలకు ముందు ఆ ప్రాంతానికి ఇచ్చిన హామీల గురించి కూడా సీఎం గారు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై తిక్కారెడ్డి స్పందిస్తూ, ఎన్నికలకు ముందు ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ తమ దృష్టికి రాలేదని, ఫలితంగా ఆ సమయంలో ఎలాంటి హామీ ఇవ్వలేకపోయామని వివరించారు.
ఈ విషయంపై జిల్లా నాయకులంతా కూలంకషంగా చర్చించుకుని, తగిన ప్రతిపాదనతో తన వద్దకు రావాలని చంద్రబాబు నాయుడు గారు తిక్కారెడ్డికి సూచనలు చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన నేతలలో ఆదోనికి చెందిన చిన్న బసప్ప కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ అంశంపై దృష్టి సారించడంతో, ఆదోని ప్రజల ప్రత్యేక జిల్లా కల త్వరలోనే నెరవేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి స్పందనతో ఈ డిమాండ్‌కు ప్రాధాన్యత పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఆదోని జిల్లా వాసులు ప్రత్యేక జిల్లా చేయడం వల్ల ఆదోని అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు