విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం షాక్?
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ,రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం డీపీఆర్ ల రూపకల్పన ఇంకా అధ్యయనంలో ఉన్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కొత్త జోన్ కార్యకలాపాల కోసం ఎలాంటి నిర్ధిష్టమైన గడువునూ విధించలేదని తెలిపిన రైల్వేశాఖ... తూర్పుకోస్తా రైల్వే లో కొత్త జోన్ ఏర్పాటు, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21, 2021-22, 2022-23 ఆర్ధిక సంవత్సరాలకు 170 కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ కొత్త జోన్, డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వ్యయం చేయలేదని తెలిపింది. రాయగడ రైల్వే డివిజన్.. తూర్పుకోస్తా రైల్వే జోన్ లోనే కొనసాగుతుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.