ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాకు అమెరికా బిగ్ షాక్‌?

Chakravarthi Kalyan
రష్యా పదమూడో రోజూ ఉక్రెయిన్‌ పై యుద్ధం కొనసాగించిన నేపథ్యంలో అమెరికా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి అమెరికా ఇకపై చమురు దిగుమతులు చేసుకోదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మాస్కోను శిక్షించడంలో భాగంగాఈ ప్రకటన చేస్తున్నట్టు జో బైడెన్ ప్రకటించారు.
మేం రష్యన్ చమురు మరియు గ్యాస్ మరియు ఇంధనం యొక్క అన్ని దిగుమతులను నిషేధిస్తున్నామని జో బైడెన్ ప్రకటించారు. ఇకపై అమెరికా నౌకాశ్రయాలలో రష్యా చమురు రవాణా ఆమోద యోగ్యం కాదన్నమాట. అలాగే అమెరికన్ ప్రజలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గట్టి దెబ్బ చూపిస్తారని జో బైడన్ అన్నారు. ఈ కఠినమైన నిర్ణయాన్ని మిత్రదేశాలతో సంప్రదింపుల తర్వాతే తీసుకున్నట్టు కూడా అమెరికా ప్రకటించింది. మరి అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: