ఉక్రెయన్ నుంచి ఇప్పటి వరకు ఇండియాకు 18 వేల మంది..?
మరో 24 గంటల్లో 18 విమానాలు భారత్‌కు చేరతాయని విదేశాంగ శాఖ తెలిపింది. దీని ద్వారా 2,3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి వస్తారని ఈ విదేశాంగ శాఖ తెలిపింది. నిన్న కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఖార్కివ్‌ను వీడారని.. అసలు మొత్తం ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్, రష్యాతో వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.