జేఈఈ ఎఫెక్ట్‌: ఇంటర్ పరీక్షల షెడ్యూలులో మార్పులు

Chakravarthi Kalyan
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించిన కారణంగా.. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్‌ వల్ల ఇంటర్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

వీటితో పాటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్  ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో మొదలవుతుంది. మే 11న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలతో ముగుస్తాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23న 2nd లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభం అవుతాయి. మే 12న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలతో ముగుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: