వారి బాధ్యత నాదే: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన?

Chakravarthi Kalyan
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. కష్టకాలంలో  పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను ఆదుకుంటానన్న ఆయన.. పార్టీకి చెందిన వారి కుటుంబాలకు చెందిన 400 మంది విద్యార్థులు చదువు బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 65 రోజులుగా ఆయన కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట కార్యక్రమం నిర్వహించారు.

తాజాగా ఈ కార్యక్రమం ముగించిన ఎమ్మెల్యే.. పార్టీ కార్యకర్తలు, నాయకుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేశానన్నారు. 65 రోజల్లో 5,019 మంది కార్యకర్తల ఇళ్లకి వెళ్లానని ఆయన తెలిపారు. వారిలో  1,072 మంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కోటంరెడ్డి అన్నారు. ఆ కుటుంబాలకు చెందిన 400 మంది విద్యార్థుల చదువుల బాధ్యత తానే భరిస్తానన్నారు. ఆ విద్యార్థులుప్రయోజకులయ్యేంత వరకు వారి బాధ్యత తనదేనన్నారు. మరో 672 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: