పుతిన్‌ కు ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగి విరుచుకుపడుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసినప్పుడు.. సాదరంగా రిసీవ్ చేసుకున్న పుతిన్.. తాము ఉక్రెయిన్ పై దాడికి దిగడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. నాటో తో రష్యాకు విబేధాలు ప్రారంభమవడం దగ్గర నుంచి ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునేందుకు జరిగిన ప్రయత్నాలు అన్నీ వివరించారట పుతిన్.


ఆ పరిణామాలు విన్న తర్వాత మోడీ.. అవన్నీ తనకు అవగాహన ఉన్నాయని.. అయితే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని మోడీ కోరినట్టు తెలుస్తోంది. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని.. చర్చల దిశగా త్వరగా ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రధాని మోడీ పుతిన్‌ను కోరినట్టు తెలుస్తోంది. యుద్ధం త్వరగా ముగియాలని.. శాంతి సామరస్యాలు నెలకొనాలని ఇండియా భావిస్తున్నట్టు ప్రధాని మోడీ పుతిన్‌తో మాట్లాడినట్టు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: