ఇవాళ్టి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు..!
రేపటి నుంచి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మ వార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీమల్లికార్జున స్వామి, అమ్మ వార్ల వాహన సేవలు చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలవు. స్వామివార్ల గ్రామోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఈ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం అధికారులు వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం ఆన్ లైన్‌లో దర్శనం టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్‌లో భక్తులకు రూ.500 అతి శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా రూ.200 శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లు కూడా లభిస్తాయి.