సెబ్బాస్ రా భీమ్లా నాయ‌కా ! వేడుకలు వాయిదా !

RATNA KISHORE
ఏపీ మంత్రి
 మేక‌పాటి గౌతం రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం నేప‌థ్యంలో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక‌లు వాయిదా ప‌డ్డాయి. వేడుకలు ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా త‌న సంతాప సందేశాన్ని ఉంచింది.వాస్త‌వానికి ఇవాళ  హైద్రాబాద్ లో ప్రీ  రిలీజ్ వేడుకలు జ‌ర‌గాల్సి ఉన్నా,ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో,ఆంధ్రాలో నెల‌కొన్న విషాద నేప‌థ్యంలో వేడుక‌లు వ‌ద్ద‌నుకుని వెనక్కు త‌గ్గింది నిర్మాణ సంస్థ. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్
మంత్రి మేక‌పాటి మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
ప‌వ‌న్ ఏమ‌న్నాంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రాష్ట్ర మంత్రి గా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం.విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవ హరించారు. శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డికి, ఇత‌ర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..అని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: