ఏపీకి ఆయువుపట్టుగా చెప్పుకునే పోలవరం నిర్మాణం విషయంలో ఓ గుడ్‌న్యూస్.. అదేంటంటే.. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ ను 2023 జులై 2 తేదీ వరకు నిలుపుదల చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2011 లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ గతంలోనే ఆదేశాలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆదేశాలను మరో రెండేళ్ళ పాటు పొడిగిస్తూ ఇప్పడు మరోసారి ఉత్తర్వులు వచ్చాయి. స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వుల నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ వెసులు బాటు కల్పించింది. కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు అయినందువల్ల పోలవరానికి మరో రెండేళ్ల పాటు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మరో రెండేళ్ల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఆటంకం లేదన్నమాట.