మళ్లీ గుడ్‌న్యూస్ చెప్పిన జగన్: 2,588 ఉద్యోగాలు?
సర్జన్ , అసిస్టెంట్ సర్జన్లుగా 446 మందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా నర్సింగ్, ఫార్మసిస్టులు, పోస్టుమార్టమ్ అసిస్టెంట్ లు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించబోతున్నారు. వీరితో పాటు క్లాస్ 4 ఉద్యోగులను కూడా నియమిస్తారు.. అయితే.. వీరిని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.