కొవాగ్జిన్‌తో కోట్లు సంపాదించిన కేంద్రం..ఎలాగంటే..?

Chakravarthi Kalyan
కొవాగ్జిన్.. ఈ కరోనా టీకా భారత్‌ ప్రతిష్టను మరింత పెంచింది. ఇండియాలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టీకా ఇది.. అలా తయారైన మొట్టమొదటి టీకా ఇది. భారత్‌ బయోటెక్ సంస్థ.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన్ ఐసీఎంఆర్‌తో కలసి దీన్ని రూపొందించింది. ఈ టీకా తయారీలో భారత్‌ బయోటెక్‌కు ఐసీఎంఆర్‌ తోడ్పాటు అందించింది.


అలా భారత్‌ బయోటెక్‌కు సహకరించినందుకు ఐసీఎంఆర్‌ కు కూడా ప్రతిఫలం దక్కింది. కొవాగ్జిన్‌ టీకా విక్రయం ద్వారా భారత్‌ బయోటెక్‌ సంస్థ నుంచి ఐసీఎంఆర్‌కు రూ.171.74 కోట్లు ఆదాయం వచ్చిందట. ఈ విషయం కేంద్రమే ప్రకటించింది. రాయల్టీ రూపంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ  ఐసీఎంఆర్‌కు రూ.171.74 కోట్లు ఇచ్చిందట. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఈ విషయాన్ని రాజ్యసభలో తెలిపారు.

కాంగ్రెస్ నేత, ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. కొవాగ్జిన్‌ పరిశోధన, అభివృద్ధి కోసం ఐసీఎంఆర్‌ రూ.35 కోట్లు ఖర్చు చేసిందట. అంటే 35 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటికే 171 కోట్ల ఆదాయం వచ్చిందన్నమాట. అంతే కాదు.. ఐసీఎంఆర్‌ వద్ద ఉన్న నిధులను పరిశోధన కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: