పిలిచి సీఎంను చేస్తానంటే.. నా వల్ల కాదంటున్నాడు..?

Chakravarthi Kalyan
రాజకీయంగా ఎదగాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ.. కొందరు మాత్రం తాము ఆ స్థానానికి ఎంత వరకూ అర్హత ఉన్నవారమో గుర్తిస్తారు. అయితే.. తాజాగా ఓ వ్యక్తిని మాత్రం మీరే మా సీఎం అభ్యర్థి అని అంటుంటే ఆయన మాత్రం కాస్త తడబడుతున్నారు. ఆయన ఎవరో కాదు.. పంజాబ్ సీఎం చన్నీ.. సీఎం అభ్యర్థిత్వంపై అక్కడి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఆశలతో చాలా కాలం ఉత్కంఠంగా ఆశలు పెట్టుకున్న వేళ.. ఆయన ఆశలపై నీళ్లు చల్లింది అధిష్టానం.


పంజాబ్ ప్రస్తుత సీఎం చన్నీనే మరోసారి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. దీనిపై సిద్ధూ వైఖరి ఎలా ఉంటుందో అని నాన్చుతూ వచ్చింది. తాజాగా సీఎం అభ్యర్థిపై తన అభిప్రాయాలను సిద్ధూ వెల్లడించారు. పార్టీ హైకమాండ్ బలహీనమైన సీఎంను కోరుకుంటోందన్న సిద్ధూ ఏ అభ్యర్థీ శక్తిని చాటుకోలేని గుర్రంలా ఉండాలనుకోరని సిద్ధూ చమత్కరించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ మాత్రమే ఓడించగలదని చన్నీ అంటున్నారు వ్యాఖ్య.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: