వారెవా.. యంగ్ ఇండియాదే ప్రపంచ కప్‌..!

Chakravarthi Kalyan
వావ్.. మన కుర్రాళ్లు మరోసారి అదరగొట్టేశారు.. ఇండియాకు ప్రపంచ కప్‌ తెచ్చేశారు. అండర్ 19లో ఇండియా రికార్డును మరోసారి మెరుగుపరిచారు. ఇప్పటికే నాలుగు సార్లు అండర్ 19 ప్రపంచ కప్‌ కొట్టేసి తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్న యంగ్ ఇండియా ఇప్పుడు మరోసారి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భారత్‌కు అయిదో అండర్‌-19 ప్రపంచ కప్‌ వచ్చేసింది. ప్రపంచ కప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ ఇండియా మరోసారి విజయాన్ని ముద్దాడింది.


ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు 189 పరుగులకే ఆల్‌ ఔట్‌ అయ్యింది. రాజ్‌ బవా ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టాడు.. కుర్రాళ్ల మెరుగైన ఆటతో ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి.. భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ సిరీస్‌లో అదరగొట్టిన తెలుగు తేజం షేక్‌ రషీద్‌ చివరి మ్యాచ్‌లోనూ రాణించాడు. అర్ధశతకాలతో చెలరేగిన షేక్‌ రషీద్‌, నిషాంత్‌ సింధు భారత్‌కు విజయం చేకూర్చారు. ఇంగ్లాండ్‌ బ్యాటర్ జేమ్స్‌ రెవ్‌ 94 ఒంటరి పోరాటం ఫలించలేదు. భారత్‌ బౌలింగ్‌ లో రాజ్‌బవా ఒక్కడే 5 వికెట్లు తీయగా రవికుమార్‌ 4, కౌషల్‌ తంబే ఒక వికెట్‌ తీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: