టాలీవుడ్: సోమవారం కీలక భేటీ.. తేల్చేస్తారా..?
మెగాస్టార్ చిరంజీవి సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించిన విషయాలను వివిధ సంఘాల ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు... ఏపీ ప్రభుత్వ ఆలోచనా విధానం.. అన్నింటిని చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. సినిమా టికెట్ల వివాదం.. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లు నిర్ణయించుకునే అవకాశం.. కొవిడ్ నిబంధనల ఎత్తివేత.. ఇలా ఇటీవలి కాలంలో అనేక అంశాలపై ఏపీ ప్రభుత్వం, నిర్మాతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దల భేటీ ఆసక్తి రేపుతోంది.