వండర్‌ : పోయిన 24 ఏళ్లకు దొరికిన బంగారం..?

Chakravarthi Kalyan
పోయిన వస్తువు దొరకిందంటే అందుకు చాలా అదృష్టం ఉండాలి. అందులోనూ పోయింది ఏదైనా విలువైన వస్తువు అయితే.. ఎవరికైనా దొరికినా దాన్ని తిరిగి ఇస్తారన్న గ్యారంటీ ఏమీ ఉండదు. కానీ.. అత్యంత విలువైన వస్తువులు కూడా పోయిన చాలా కాలానిది దొరికితే అదో షాకింగ్ వార్తే అవుతుంది కదా. అలాంటి ఓ విచిత్రమే మహారాష్ట్రలో జరిగింది.

ఈ ఘటనలో 24 ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన బంగారం తిరిగి మళ్లీ యజమాని ఇంటికి చేరింది. కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు అసలు యజమానికి అప్పగించారు. అసలేం జరిగిందంటే.. ముంబయి కొలాబా ప్రాంతంలోని అర్జన్ దాస్వానీ  ఇంట్లో 1998లో దొంగతనం జరిగింది. ఆ ఘటనలో రెండు పురాతన బంగారు నాణేలు, 3 బంగారు కంకణాలు, రెండు కడ్డీలను దుండగులు మాయం అయ్యాయి. అర్జన్ కుటుంబం అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ తమ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటూ ఏళ్లుగా క్రమం తప్పకుండా పోలీసులను అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సొమ్మును పోలీసులు అసలు యజమానికి అప్పగించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: