బ్రేకింగ్‌: ఢిల్లీ విమానాశ్రయం రన్‌వే క్లోజ్..?

frame బ్రేకింగ్‌: ఢిల్లీ విమానాశ్రయం రన్‌వే క్లోజ్..?

Chakravarthi Kalyan
నేటి నుంచి కొన్ని గంటలపాటు ఢిల్లీ విమానాశ్రయ రన్‌ వే మూతపడుతోంది. రన్‌ వే ను అధికారులు మూసివేయనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ రిహార్సల్స్‌ పూర్తి స్థాయిలో మొదలైన నేపథ్యంలో ఈ రన్‌ వే ను మూసివేశారు. నేటి నుంచి 26వరకు కొన్ని గంటల పాటు రన్‌వే మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఎలాంటి విమానాలు రాకపోకలు అనుమతి లేదని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు, రేపు ఉదయం 10.45గం.ల నుంచి 12.45గం.ల వరకు రన్‌వే మూసివేస్తారు.  

22 నుంచి 26న గణతంత్ర దినోవత్సం వరకు ఉదయం 11.15గం.ల నుంచి 12.45గం.ల వరకు రన్‌వే మూసివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం రోజు జరిగే ఫ్లైపాస్ట్‌ నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More