ఏపి ఫిట్ మెంట్ : ఎవరికి లాభం ఎవరికి నష్టం


ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు మరో  కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం ఉద్యోగులను శాంత పరిచిందా ? వారి డిమాండ్ లు నెరవేరినట్లేనా  ?
 ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఉద్యోగులకు అనుకూలంగా ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.  ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రకటించారని ఉద్యోగులు తెలిపారు. 2018 జూలై నుంచి ఈ నిర్ణయాన్నివర్తింప జేస్తారు.  ఇప్పటి వరకూ ఉద్యోగులకు ప్రభుత్వం ఏడు డిఏలు బాకీ ఉంది. ఈ డిఏ లన్నింటినీ కలిపి జనవరి నెల జీతాలలో ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసును అరవై సంవత్సారాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా అంచనాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై అదనంగా 10,247 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూనా 30 లోగా ప్రోబేషన్, కన్ఫర్మేషన్ చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కాగా  ఫిట్ మెంట్ విషయంలో ఉద్యోగులుపెదవి విరుస్తున్నారు. తాము కోరిన విధంగా ఫిట్ మెంట్ ఇవ్వలేదని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. చాలా విషయాలలో ఇంకా స్పష్టత రాలేదని వారు తెలిపారు..కాగా ముఖ్యమంత్రికి అనుకూల మైన ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశాయి.  నిరుద్యోగుల సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు మరో రెండు సంవత్సరాలు పెంచడంతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు మరో రెండు సంవత్సరాలు వెనుకబడుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: