బుక్కరాయ సముద్రం : ఠాణాలో మాజీ మంత్రులు ?


తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులను పోలీసులు ఠాణాలో నిర్బందించారు. ఈ ఘటన  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలో జరిగింది. ఎవరా మాజీ మంత్రులు ? ఎందుకు వారిని నిర్భందించారు ? అసలేం జరిగిందక్కడ ?
అనంతపురం జిల్లా పుటపర్తి నియోజక వర్గం పరిధిలోని ఓ స్మశానానికి చెందిన స్థలంలో హెల్త్ కేర్ క్లినిక్ నిర్మిస్తున్నారని, గత  వారం పది రోజులుగా రగడ జరుగుతోంది.  అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిబంధనలను అతిక్రమిస్తున్నారని, ఆఖరుకు స్మశానాన్ని కూడా వదలడం లేదని తెలుగదేశం పార్టీ నేతులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కాస్తా క్రమంగా  పెద్దదైంది. దీంతో తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు శుక్రవారం పుటపర్తి బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు హాజరు కావాలని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ అధినాయకులను కోరాయి. దీంతో మాజీ మంత్రులు పెల్ల రఘనాథ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు  అమరావతి నుంచి  పుటపర్తికి బయలు దేరారు. వారు అనంతపురుం జిల్లా బుక్కరాయ సముద్రం పరిసరాలలోకి రాగానే పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని  స్థానిక ఠాణాకు తరలించారు. మీరు పుటపర్తికి వెళితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు మాజీ మంత్రులకు చెప్పినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: