బ్రేకింగ్ : వంగ‌వీటి రాధాతో చంద్ర‌బాబు భేటీ.. అందుకేనా..?

N ANJANEYULU
వంగ‌వీటి రాధా ఇంటికి వ‌చ్చారు ఇవాళ చంద్ర‌బాబు నాయుడు.  ఇటీవ‌లే త‌నపై హ‌త్య‌కు రెక్కీ నిర్వ‌హించారు అని వంగవీటి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విధిత‌మే. తాజాగా ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న నివాసానికి వెళ్లి వంగ‌వీటితో అందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆరా తీసారు.  రాధా రెక్కీ నిర్వ‌హించార‌న్నే అంశంపై ఆరాతీసి.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. గ‌న్‌మెన్ల‌ను తిర‌స్క‌రించార‌నే దానిపై సూచ‌న‌లు చేసారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. దోషుల‌ను ప‌ట్టుకొని శిక్షించిన‌ప్పుడే పోలీస్ వ్య‌వ‌స్థ‌పై విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.
ప్ర‌జ‌లు న‌మ్మె విధంగా ఇన్వెస్టిగేష‌న్ చేయాల‌ని.. ఇప్ప‌టికే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్నారు. కొత్త రాజ‌కీయాల‌కు  పోరాడే దిశ‌గా  టీడీపీ అండ‌గా ఉంటుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు.  కుట్ర పూరితంగానే రాధాపై ఈ వ్య‌వ‌హారం జ‌రిగింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.     భ‌ద్ర‌త విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు రాధాకు సూచించారు.  త్వ‌ర‌గా ఇన్విస్టిగేష‌న్ పూర్తి చేయాలి. కొన్ని ఆధారాలు ఉండ‌గా దోషుల‌ను ఎందుకు ప‌ట్టుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దోషుల‌ను ర‌క్షించే విధంగా చేస్తున్నార‌ని.. శిక్షించే విధంగా చేయ‌డం లేద‌ని మండి ప‌డ్డారు చంద్ర‌బాబు. రెక్కీ చేసిన మాట వాస్త‌వ‌మా కాదా.. ఇవ‌న్నీ సీసీ టీవీ కెమెరాల్లో ఉన్నాయా లేదా అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. గ‌న్‌మెన్లు ఇస్తే స‌రిపోతుందా..?   విచార‌ణ ఏమి చేసారు. దోషుల‌ను శిక్షించ‌కుండా ఉంటే ఎలా.. త‌ప్పుడు ప‌నుల‌ను చేసే వ్య‌క్తుల‌ను ఎవ‌రినైనా శిక్షించాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. సీసీ పుటేజీ ఉంటే ఎందుకు కాల‌యాప‌న చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: