నేడు సినిమా థియేటర్ల యాజమాన్యాల భేటీ.. ఎందుకంటే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం సినిమా టికెట్ల రేట్లు, సినిమా థియేట‌ర్ల త‌నిఖీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేట‌ర్ల‌లో రెవెన్యూ అధికారులు త‌నిఖీ చేప‌డుతున్నారు. సినిమా టికెట్లను అధిక ధ‌ర‌ల‌కు అమ్మినా.. సినిమా థియేట‌ర్ల‌కు సంబంధించి ఎలాంటి ధృవీక‌ర‌ణ ప‌త్రాలు లేక‌పోయినా సీజ్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా సుమారు 50కి పైగా థియేట‌ర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు సీజ్ చేసారు. కొన్ని సినిమా థియేటర్ల యాజ‌మాన్యాలే స్వ‌చ్ఛందంగా మూసేసాయి.
ముఖ్యంగా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో.. థియేట‌ర్ల‌తో పాటు ప్ర‌స్తుతం ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌పై  ఇవాళ రాజ‌మండ్రిలో సినిమా ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ య‌జ‌మానులు జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హిస్తారు.  ఈ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది. ఇదిలా ఉండ‌గా. భారీ బ‌డ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు రాధేశ్యామ్ వంటి  మ‌రికొన్ని సినిమాలు సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై ఇప్ప‌టికే హై కోర్టు విచార‌ణ చేప‌డుతుంది. ఇవాళ  సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై   ఏపీ హై కోర్టు మ‌రొక‌సారి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది.  ఓ వైపు హై కోర్టు తీర్పు ఈ విధంగా ఉంటుంద‌ని.. ఈ భేటీలో ఏమి చ‌ర్చిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: