ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..!
ఐదవతరగతి వరకు విద్యార్థులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావచ్చు అని.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఓ ప్రటనలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి విధించిన ఆంక్షలపై సడలింపులకు సంబందించిన వివిధ సంస్థల అభ్యర్థనలను కమిషన్ పరిశీలించిందని ఒక ప్రకటనలో పేర్కొంది. నగరంలో వాయు కాలుష్యం స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న దేశ రాజధానిలోని పాఠశాలలు మూసివేసారు. ఇదిలా ఉండగానే మరోవైపు ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదు అవ్వడంతో.. టెన్షన్ కలిగిస్తోంది.