తెలంగాణ హై కోర్టు కీల‌క తీర్పు.. జ‌గ‌న్ కు నోటీసులు..!

N ANJANEYULU
అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ కు బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వేసిన పిటిష‌న్‌ను ఇవాళ తెలంగాణ హై కోర్టు విచారించింది.  ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. జ‌గ‌న్‌పై 11 ఛార్జీషీట్లు ఉన్నాయ‌ని, జ‌గ‌న్ బ‌య‌టుంటే త‌న ప‌ద‌వీని అడ్డుపెట్టుకుని సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్న‌ద‌ని.. ఈ మేర‌కు పిటిష‌న‌ర్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసుల‌ను త్వ‌ర‌త‌గతిన ముగించాల‌న్నారు. అదేవిధంగా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేసి అన్నీ ఛార్జీ షీట్ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. ఈ త‌రుణంలో జ‌గ‌న్‌కు హై కోర్టుకు నోటీసులు జారీ చేసిన‌ది. ఇక త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది కోర్టు. నోటీసుల‌కు జ‌గ‌న్ ఇచ్చే స‌మాధానమును బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోనున్న‌ది హై కోర్టు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని గ‌తంలోనే ఎంపీ ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విష‌యం విధిత‌మే.ఈ త‌రుణంలోనే న‌ర్సాపురం ఎంపీ హై కోర్టును ఆశ్ర‌యించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: