సర్వే పూర్తయ్యాక రిపోర్ట్..! : కలెక్టర్
ఏప్రిల్ వచ్చిన ఫిర్యాదుల మేరకు సర్వే నిర్వహించామని, ఈ విషయంలో జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ప్రొసీజర్ ప్రకారం చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభమైందని వివరించారు. ఈ సర్వేలో సీలింగ్ ల్యాండ్, అసైన్‌మెంట్ ల్యాండ్, పట్టా భూమి ఎంత అనేది త్వరలో కచ్చితంగా తేలుస్తాం అని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు కలెక్టర్. రైతులు తమ భూమి సమస్యను అత్యంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.