చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్
ముఖ్యంగా మధురానగర్‌లో 5 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. ప్రధాన రోడ్లలో మూడు అడుగుల వరకు నీటి ప్రవాహం కొనసాగుతొంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ఎస్పీ సూచించారు. వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు శుక్రవారం, శనివారం రెండు పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు కలెక్టర్.