టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. గత సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలు కోక ముందే ఆయనకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇక ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఆయన పట్టు నిలుపు కోలేక పోతున్నారు. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ ని అధికార వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాల్టీ లో ఉన్న 25 వార్డులకు గాను 14 వ వార్డు ఇప్పటికే అధికార పార్టీకి ఏకగ్రీవం అయ్యింది.
ఇక మిగిలిన వార్డుల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించి కుప్పం పై తన జెండా ఎగర వేసింది. చంద్రబాబు తో పాటు లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా కుప్పం లో టీడీపీ జెండా ఎగరలేదు. ఇది ఓ విధంగా చంద్రబాబుకు తీవ్ర అవమానం లాంటిదే అని చెప్పాలి.