రాజంపేట మున్సిపోల్స్‌లో ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు.
అలాగే 24 వ వార్డు లో వైసిపి అభ్యర్థి చప్పిడి శ్వేతారెడ్డి 300 మెజార్టీతో విజయం సాధించారు. ఇక 4 వ వార్డులో వైసీపి అభ్యర్థి రవి 50 ఓట్లు మెజార్టీతో గట్టెక్కారు. ఇక 17వ వార్డు లో వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి 600 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో మునిసిపల్ చైర్మన్ భారీ మెజార్టీతో గెలిచినట్టు అయ్యింది. ఇక మిగిలిన వార్డుల కౌంటింగ్ సరళి చూస్తుంటే వైసీపీ ఇక్కడ బంపర్ మెజార్టీతో విజయం సాధించే పరిస్థితి ఉంది.