యూపీలో జికా వైరస్ కలకలం..!
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా.. గత వారం రోజులుగా కాన్పూర్‌లో పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. దోమల ద్వారా సంక్రమించే ఈ కేసుల సంఖ్య బారీగానే 100కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. జికా వైరస్ ను అరికట్టేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ వెల్లడించారు.