టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

N ANJANEYULU
ప్ర‌పంచ‌క‌ప్ టీ20 2021లో ఆదివారం తొలి మ్యాచ్‌లో శ్రీ‌లం వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌ల మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. గ్రూపు-1లో భాగంగా ఇప్ప‌టికే రెండు పోటీలు జ‌రిగాయి. ఇక మూడ‌వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌, బంగ్లా మ‌ధ్య షార్జా వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతున్న‌ది. గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరొక విజ‌యంతో 2 పాయింట్లు సాధించాయి. ఈ టోర్న‌మెంట్‌లో లంక జ‌ట్టు అజేయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించింది. నెద‌ర్లాండ్‌, ఐర్లాండ్‌, న‌మీబియాల‌ను స‌మ‌గ్ర‌మైన రీతిలో ఓడించి దాసున్ శ‌న‌క నాయ‌కత్వంలో టోర్న‌మెంట్‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని సాదించారు.
 శుక్ర‌వారం నాడు జ‌రిగిన మ్యాచ్‌లో ఏకంగా డ‌చ్‌వాసుల‌ను 44 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చింది శ్రీ‌లంక‌. కేవ‌లం 7.1 ఓవ‌ర్ల‌లోనే లంక ల‌క్ష్యాన్ని చేదించింది. మ‌రోవైపు బంగ్లా టైగ‌ర్స్ స్కాట్లాండ్‌పై ఆరు ప‌రుగుల తేడాతో ఓడిపోయారు. ఓమ‌న్‌, పాపువా, న్యూగినియాల‌ను ఓడించి సూప‌ర్ 12కు చేరుకున్నారు. 2007 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బంగ్లాదేశ్, శ్రీ‌లంక టీమ్‌లు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎప్పుడు త‌ల‌ప‌డ‌లేదు. తొలిసారి త‌ల‌ప‌డుతున్న ఈ జ‌ట్టుల‌లో ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తుందో కొద్దిసేపు వేచి చూడాలి.
బంగ్లాదేశ్ త‌రుపున మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్(కీపర్), మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఆడుతున్నారు.
శ్రీ‌లంక టీమ్ లో కుసల్ పెరీరా(కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహిరు కుమారలు టీమ్ స‌భ్యులు. అయితే శ్రీ‌లంక జ‌ట్టు టాస్ విజ‌యం సాధించి ఫీల్డింగ్ ఎంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: